Pawan Kalyan: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేశారు. స్థానికంగా యనమల భాస్కర్ రావుపై వ్యతిరేకత ఉండడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Pawan kalyan: కాబోయే ప్రధాని ఆయనే.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జనసేన పోటీ చేసే అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనముల భాస్కరరావు పేరును పవన్ ప్రకటించారు. అయితే స్థానికంగా భాస్కర్ రావు పై వ్యతిరేకత రావదంతో ఆ స్థానాల్లో అభ్యర్థిని మార్చారు. తాజాగా రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేశారు. సర్వేలు, స్థానిక ప్రజల బలం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. పొత్తులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరులో జననసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ALSO READ: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

జనసేన ప్రకటించిన లిస్ట్..

* పిఠాపురం – పవన్ కళ్యాణ్
* నెర్లిమల్ల – మాధవి
* అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
* కాకినాడ – పంతం నానాజీ
* రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
* తెనాలి – నాదెండ్ల మనోహర్
* నిడదవోలు – కందుల దుర్గేష్
* పెందుర్తి – రమేష్ బాబు
* యలమంచిలి – విజయ్ కుమార్
* పి. గన్నవరం- సత్యనారాయణ
* రాజోలు – దేవవరప్రసాద్
* భీమవరం – పూలవర్తి ఆంజనేయులు
* తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
* ఉంగుటూరు – ధర్మరాజు
* పోలవరం – చిర్రి బాలరాజు
* నర్సాపురం – నాయకర్
* తిరుపతి- అరణి శ్రీనివాసులు
* రైల్వే కోడూరు – అరవ శ్రీధర్

రెండు లోక్ స్థానాలు

* మచిలీపట్నం – బాలశౌరి
* కాకినాడ – తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

Advertisment
Advertisment
తాజా కథనాలు