YS Sharmila: జగన్ బీజేపీకి దత్తపుత్రుడు.. అందుకే ఇంత వరకూ..

జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టే వైసీపీ అవినీతిలో కురుకుపోయినా చర్యలు తీసుకోలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. పోలవరం ప్రాజెక్ట్ ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అమిత్ షా చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన.. బీజేపీకి లొంగిపోయిన పార్టీలని ఫైర్ అయ్యారు.

New Update
YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

YS Sharmila:  వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి తొత్తులేనని విమర్శలు గుప్పించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కంటికి కనిపించని పొత్తు జగన్ పార్టీ అని అన్నారు. జగన్ బీజేపీ దత్త పుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. మోడీ వారసుడిగానే జగన్ కొనసాగుతున్నారన్నారు. జగన్ బీజేపీకి తొత్తు కాబట్టే వైసీపీ అవినీతిలో కురుకుపోయినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిగ్గు చేటు..

పోలవరం ప్రాజెక్ట్ ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అమిత్ షా చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. పదేళ్లలో పూర్తి చేయలేనిది రెండేళ్లలో పూర్తి చేస్తామంటే నమ్మేవాళ్ళు లేరని..20 కోట్ల ఉద్యోగాలను తుంగలోకి తోసేసారని మండిపడ్డారు. నల్లదనం అంతా బీజేపీ నేతల దగ్గరే ఉందని ఆ ధనమంతా వెలికి తీస్తామని చెప్పారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని అయితే, మళ్ళీ ఇప్పుడు తిరుమల దేవాలయాన్ని పరిరక్షణ బాధ్యతగా తీసుకుంటామని చెప్పడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు.

Also Read: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా బాధ్యతలు

గొడ్డలి రాజకీయాలు తెలియదు..

టీడీపీ, వైసీపీ, జనసేన.. బీజేపీకి లొంగిపోయిన పార్టీలన్నారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజి, దుగ్గరాయపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. జగన్ వేసే కుక్క బిస్కేట్ లకోసమే తనపై తెలంగాణ నేత రాఘవరెడ్డి ఆరోపణలు చేశారన్నారు. తండ్రి పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిన వారికి వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువు ఉంటే బయట పెట్టాలన్నారు. అవినాష్ రెడ్డీలా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు