TDP 2nd List : టీడీపీ రెండో జాబితా సిద్ధం.. నేడే రిలీజ్!

రానున్న ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అటు జనసేన అధినేత పవన్‌ పోటిపైనా ఇవాళే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

New Update
TDP 2nd List : టీడీపీ రెండో జాబితా సిద్ధం.. నేడే రిలీజ్!

AP Elections 2024 : రానున్న సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections) కోసం టీడీపీ(TDP) రెండో జాబితాను సిద్ధం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) జాబితాకు సంబంధించి తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఇవాళ (మార్చి 14, 2024) ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయనున్నారు. అటు బీజేపీ ఏం చేయబోతున్నదానిపై స్పష్టత లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

అమిత్‌ షా ఫైనల్ చేస్తారట:
అటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) తమ పార్టీ అభ్యర్థుల జాబితాపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఆయా స్థానాల్లో పోటీ చేసే నియోజకవర్గాలు, అభ్యర్థులపై స్పష్టత ఉన్నప్పటికీ షెకావత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) లకు ముందుగా లిస్ట్‌ను సమర్పించనున్నారు. కేంద్ర బీజేపీ నేతలు అంగీకారం తెలిపిన తర్వాతే తుది జాబితాను ప్రకటిస్తారు.

పవన్‌ ఎక్కడ నుంచి పోటి చేస్తారు?
జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం టీడీపీ కొత్తగా 50 పేర్లను విడుదల చేయాల్సి ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి టీడీపీ 17 నియోజకవర్గాల నుంచి, బీజేపీ ఆరు, జనసేన రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది. నిజానికి అసెంబ్లీ సెగ్మెంట్లతో పోలిస్తే పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంచుకోవడం సవాలుగా ఉంటుంది. మరోవైపు పవన్‌ ఎక్కడ నుంచి పోటి చేస్తారన్నదానిపై కూడా ఇవాళే క్లారిటీ వచ్చే అవకాశముంది. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని ఓవైపు.. ఎంపీగా పోటికి దిగుతారని మరోవైపు.. ఇలా రకరకాల ఊహాగానాల మధ్య పవన్‌ ఎక్కడ నుంచి పోటికి దిగుతారన్నది ఉత్కంఠగా మారింది.

Also Read: నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు..అసలు కారణం ఇదే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు