AP Elections 2024: మా టికెట్ అడగొద్దు ప్లీజ్.. పవన్, నాగబాబు చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు!

టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో తమ టికెట్ అడగొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

New Update
AP Elections 2024: మా టికెట్ అడగొద్దు ప్లీజ్.. పవన్, నాగబాబు చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు!

AP Elections 2024: ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టికెట్ల సందడి స్టార్ట్ అయ్యింది. మరో ఒకటి, రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించి.. వారిని ప్రజల్లోకి పంపాలని సీఎం జగన్ (CM Jagan) భావిస్తున్నారు. ఆ పార్టీలో టికెట్ పై ఆశలు వదులుకున్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పక్క పార్టీల వైపు చూడడం కూడా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన గూటికి చేరిపోయారు. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు సైతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను (Pawan Kalyan) కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు టీడీపీ సైతం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచింది. అయితే.. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: తూర్పుగోదావరిలో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే.. పూర్తి లిస్ట్!

తమ టికెట్ పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఎలా అన్న ఆందోళనలో అనేక మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు టీడీపీ ఆశావహులు (TDP Leaders) జనసేన అధినేత పవన్‌, ఆయన సోదరుడు నాగబాబును రహస్యంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో (TDP Janasena Alliance) భాగంగా తమ సీట్లను అడగవద్దంటూ వారిని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు సీటు గ్యారంటీ అంటే జనసేనలో చేరేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పొత్తులో తమ నియోజకవర్గం జనసేనకు (Janasena) ఇస్తే అక్కడ పోటీకి తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య నేతలకు కూడా సీట్ల విషయంలో ఆయన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. బీఫామ్‌లు చేతికి వచ్చే వరకు సీట్లపై క్లారిటీ ఉండే అవకాశం లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు