AP Elections 2024: కూటమికి షాక్.. రెబల్స్ బరిలో ఉన్న ఆ 10 సీట్లివే!

ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

New Update
TDP Victory: బైబై వైసీపీ.. తెలుగుదేశం కూటమి హవా.. 

ఏపీలో టీడీపీ కూటమికి రెబల్స్‌ షాక్‌ ఇచ్చారు. అగ్ర నేతలు ఎంత బుజ్జగించినా.. అనేక మంది రెబల్స్ తమ నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు. టీడీపీకి ఆరు చోట్ల, జనసేనకు ఒక చోట, బీజేపీకి మూడు చోట్ల రెబల్స్‌ ఉన్నారు. మరో వైపు జనసేన పోటీ చేయని చోట ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్‌ గుర్తును ఈసీ కేటాయించింది. ఇది కూడా కూటమికి తలనొప్పిగా మారే అవకావం ఉంది. విజయనగరం, జగ్గయ్యపేట, జగ్గంపేటలో గ్లాస్‌ గుర్తును ఇతరులకు కేటాయించారు.

టీడీపీ రెబల్స్:
ఉండి - శివరామరాజు, విజయనగరం - మీసాల గీత, పోలవరం - మొడియం సూర్యచంద్రరావు, సత్యవేడు - జేడీ రాజశేఖర్‌, అమలాపురం - పడమటి శ్యామ్, కావలి - పసుపులేటి సుధాకర్‌ టీడీపీ రెబల్స్ గా ఉన్నారు. జనసేన రెబల్‌ గా జగ్గంపేటలో బరిలో ఉన్న సూర్యచంద్రకు గాజు గ్లాస్‌ గుర్తును కేటాయించింది ఈసీ.

బీజేపీ రెబల్స్ వీరే..
బీజేపీ రెబల్స్‌ విషయానికి వస్తే.. హిందూపురం-పరిపూర్ణానంద, గన్నవరం - కొర్రపోలు సూర్యారావు, అరకు(ఎంపీ) నిమ్మక జైరాజ్ ఉన్నారు. వైసీపీ రెబల్స్‌ విషయానికి వస్తే.. ఆమదాలవలస - సువ్వారి గాంధీ, కాకినాడ రూరల్ - పితాని అన్నవరం ఉన్నారు. మాడుగులలో టీడీపీ రెబల్ గా బరిలో ఉన్న పైలా ప్రసాద్‌ నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో అక్కడ కూటమి అభ్యర్థి ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు