AP Elections 2024: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. కుదిరిన బీజేపీ-టీడీపీ పొత్తు?

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి పయనం కానున్నారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో అమిత్ షా, జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ-బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది.

New Update
AP Elections 2024: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. కుదిరిన బీజేపీ-టీడీపీ పొత్తు?

TDP - Janasena - BJP Alliance: ఏపీలో రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ టీడీపీ నడుమ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి సీట్ల సర్దుబాటుపై మంతనాలు చేయనున్నారు. ఇప్పటికే ఏపీ చీఫ్ పురందేశ్వరి (BJP Chief Purandeswari) అధ్యక్షతన పొత్తులపై బీజేపీ నేతల సలహాలు, సూచనలు బీజేపీ హైకమాండ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్, పురందేశ్వరి తో అమిత్‌షా భేటీ...

ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు ఏపీ చీఫ్ పురందేశ్వరి. ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన చీఫ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఏపీలో పొత్తుల అంశంపై వారు చర్చించనున్నారు. సీట్ల పంపకం.. తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. పొత్తులపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీజేపీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లు?

జగన్ పై గెలిచేందుకు ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 99 మంది ఉమ్మడి అభ్యర్థులతో టీడీపీ జనసేన పార్టీలు తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి 5 ఎంపీ స్థానాలు, 9 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. పార్టీలోని కొందరు నేతలు పొత్తులపై అభ్యంతరం చెప్పడంతో మరోసారి సీట్ల సర్దుబాటు పై చర్చించేందుకు చంద్రబాబును ఢిల్లీకి రావాలని బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. పొత్తులపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలని అంటున్నారు ఇరు పార్టీల నేతలు.

Also Read: గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -2, గ్రూప్-3 పరీక్ష తేదీల ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు