Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు సిగ్గు రాలేదు.. సజ్జల హాట్ కామెంట్స్

చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి ఇంకా సిగ్గు రాలేదు.. మళ్ళీ అవే మోసపు మాటలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు సిగ్గు రాలేదు.. సజ్జల హాట్ కామెంట్స్

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శల దాడికి దిగారు. చంద్రబాబుకు ఇప్పటి వరకు ఇంకా సిగ్గు రాలేదని అంటూ ఫైర్ అయ్యారు.

ALSO READ: కేజ్రీవాల్‌కు ఊరట..జైలు నుంచి పరిపాలన చేయోచ్చు అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు

మోసపు మాటలు..

జగన్ (CM Jagan) బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండుగా కనిపించాయని అన్నారు సజ్జల. మంచి చేస్తే ప్రజలు ఇలా గుర్తు పెట్టుకుంటారు అని రుజువు అయ్యిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింతగా ప్రజల ఆశీర్వాదం పెరుగుతుందని ధీమా ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి ఇంకా సిగ్గు రాలేదు.. మళ్ళీ అవే మోసపు మాటలు చెప్తున్నాడని విమర్శించారు. తనకున్న అవలక్షణాలు జగన్ కు ఆపాధించాలని చూస్తున్నాడని అన్నారు.

కంటైనర్ పై క్లారిటీ...

సీఎం కార్యాలయంకి వచ్చిన కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి ఉందని అన్నారు సజ్జల. సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసి నుండి కంటైనర్ తీసుకున్నాం అని క్లారిటీ ఇచ్చారు. కంటైనర్ లో ఏదో ఉంది అని దివలాకోరు తనంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వీళ్ళ పద్దతి చూస్తుంటే పార్టీ ఆఫీస్ లో కూడా ఏదో ఉంది అని యాగి చేస్తారని అన్నారు.

అందుకేనేమో పొత్తు..

ఢిల్లీలో కాళ్ళు పట్టుకుని ఇక్కడ వాళ్ళే వచ్చారు అని సిగ్గు లేకుండా చెప్తున్నాడని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కేసుల నుండి బయటపడేందుకు బీజేపీతో పొత్తు కోసం బాబు తిరిగాడని ఆరోపించారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులు టీడీపి వ్యక్తులే అని చురకలు అంటించారు. నరసాపురం మినహా ఎంపి అభ్యర్థులు అంతా చంద్రబాబు డిసైడ్ చేసిన వాళ్ళే అని అన్నారు. బీజేపీ లో ఉన్న చంద్రబాబు ఏజెంట్ల ద్వారా ఇదంతా చేశారని విమర్శించారు. కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా వైసీపీ వైపు నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబు నాటకానికి మిగిలిన పార్టీలు బలి అయ్యాయని అన్నారు. జాతీయ పార్టీలు సైతం చంద్రబాబు నాటకంలో పడ్డాయని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు