TDP-JSP: పెడన టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి.. అస్వస్థతకు గురైన వేదవ్యాస్ కృష్ణా జిల్లా పెడనలో అసంతృప్తి సెగ నెలకొంది. పెడన టిక్కెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు చంద్రబాబు. దీంతో, సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురైయ్యారు. By Jyoshna Sappogula 24 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Politics: కృష్ణా జిల్లా పెడన నియోజవర్గం టీడీపీలో అసంతృప్తి నెలకొంది. పెడన టిక్కెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. దీంతో, తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వేద వ్యాస్..ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదన చెందారు. Also Read: అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు.. అస్వస్థత.. కృత్తి వెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురై పడిపోయారు వేదవ్యాస్. వెంటనే అలర్ట్ అయిన కార్యకర్తలు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడు అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఈసారి న్యాయం జరుగుతుందనుకున్నా..కానీ నాకు అన్యాయమే జరిగిందని వాపోయారు. చంద్రబాబు, పవన్ ను కలిసి..తనకు జరిగిన అన్యాయంపై నిలదీస్తానని అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు తనకే ఉందని చెప్పుకొచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే.. గెలిచే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. Also Read: అలా ఇస్తే లక్కి నంబర్..ఇలా ఇస్తే పావలా.. జనసేనకు ఆర్జీవీ పంచులు! భగ్గుమంటున్న జనసైనికులు ఇదిలా ఉండగా.. జనసేనకు షాకిచ్చారు పెడన జనసేన పార్టీ నాయకులు. పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టిక్కెట్ జనసేనకు ఇస్తారని ఆశపడ్డామన్నారు. బూరగడ్డ వేదవ్యాస్ ను ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటిస్తారనుకున్నామని అన్నారు. మమ్మిల్ని మోసం చేశారని..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేమని అంటున్నారు. ఈ క్రమంలో కృత్తి వెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. #andhra-pradesh #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి