Kurnool: టీడీపీ ఇంచార్జ్ ఆత్మహత్య.. భార్య ఎమోషనల్ వీడియో ..! కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆకి పోగు ప్రభాకర్ ఆత్మహత్యయత్నం చేశాడు. బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తన భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. By Jyoshna Sappogula 26 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Kurnool: టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. పలుచోట్ల ఫ్లెక్సీలు చించివేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. పలువురు తీవ్ర మనస్థపంకు గురై ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. Also Read: బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయ్..పేరెంట్స్..మీ పిల్లలు ఫిట్‌గా ఉండేందుకు ఈఫుడ్స్ ఇవ్వాల్సిందే.! తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్మహత్యయత్నం చేశాడు. టికెట్ బొగ్గుల దస్తగిరికి ఇవ్వడం పై ఆకి పోగు ప్రభాకర్ మనస్థాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Your browser does not support the video tag. Also Read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ ప్రస్తుతం మహబూబ్నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభాకర్ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై ప్రభాకర్ భార్య టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం పనిచేసిన నా భర్తకు అధిష్టానం అన్యాయం చేసిందంటూ వాపోతుంది. నియోజకవర్గంలో గత 15 ఏళ్లగా పనిచేస్తున్న తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ జెండా కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంపై ప్రభాకర్ భార్య మండిపడింది. ఇప్పటికైనా అధిష్టానం పునర్ ఆలోచించాలని వేడుకుంది. Also Watch This Video: #andhra-pradesh #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి