AP Elections 2024: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. మరో సంచలన సర్వే రిపోర్ట్ ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 119-122 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 49 - 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. By V.J Reddy 13 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Janmat Polls Survey on AP Election Results: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్వేలు సంచలనంగా మారాయి. ఇప్పటికే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు ప్రకటించగా.. తాజాగా ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చేసిన సర్వే ను 'జన్మత్ పోల్స్' సంస్థ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పగ్గాలను మరోసారి సీఎం జగన్ (YS Jagan) కైవసం చేసుకుంటారని పేర్కొంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ (YCP) అభ్యర్థులు 119-122 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. అలాగే టీడీపీ + జనసేన + బీజేపీ కూటమికి 49 - 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. Andhra pradesh assembly election 2024 Total 175 seats Ground report today YSRCP=119-122 TDP +JSP+ Bjp =49-51#AndhraPradeshElections2024 — Janmat polls (@Janmatpolls) March 13, 2024 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీదే జోరు.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) వైసీపీ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాదిస్తుందని అంచనా జన్మత్ పోల్స్ సంస్థ. ఇప్పుడు ఒకవేళ ఏపీలో ఎంపీ ఎన్నికలు జరిగితే మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 19-20 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3 నుంచి 4 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. అయితే జగన్ ను సీఎం పీఠం నుంచి తప్పిద్దాం అని కూటమిని ఏర్పాటు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మత్ పోల్స్ సంస్థ ప్రకటించిన సర్వే తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అయితే,.. ఇవి కేవలం సర్వేలే ఏ క్షణమైనా తారుమారు కావచ్చు. పార్టీల ప్రచారాలు ఆధారంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఎన్నికల ఫలితాల రోజే తెలియనుంది. loksabha election 2024 Total 543 seats Ground report today BJP =326-328 Congress =43-45 YSRCP=19-20 TMC=21-23 AAP=07-08 BJD =10-11 TDP+ =03-04 #LoksabhaElections2024 — Janmat polls (@Janmatpolls) March 13, 2024 'జీ సర్వే' కూడా వైసీపీదే.. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ ఎంపీ స్థానాలున్నాయి. ఇందులో 19 స్థానాల్లో వైసీపీ (YCP) గెలుస్తుందని జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేస్తోంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమికి 6 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. సంక్షేమం-అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారని సర్వే తేల్చింది. ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంటోంది. వైసీపీకి 48శాతం. టీడీపీ-జనసేనకు 44శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 9.. బీజేపీకి 5.. బీఆర్‌ఎస్‌కు 2 ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతోంది. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని అంచనా వేసింది జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ ఎంపీ స్థానలున్న విషయం తెలిసిందే. Also Read: వైసీపీలోకి టీడీపీ కీలక నేత #tdp #bjp #ap-elections-2024 #cm-jagan #lok-sabha-elections #jansena #janmat-polls #janmat-polls-survey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి