AP Elections 2024 : జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్! గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో రిలీఫ్ దొరికింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది. By Nikhil 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Janasena : ఎన్నికల(Elections) వేళ జనసేన పార్టీకి ఏపీ హైకోర్టు(AP High Court) లో భారీ ఊరట లభించింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని ఇటీవల హైకోర్టులో జనసేన సవాల్ చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ సింబల్(Glass Symbol) కేటాయించమని కోర్టుకు ఈసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా గ్లాస్ గుర్తు కేటాయించినా మారుస్తామని వెల్లడించిది. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాల పరిధిలో గాజు గ్లాసు కేటాయించారని జనసేన గతంలో తెలిపింది. ఈసీ ఇచ్చిన వివరణతో జనసేన పార్టీ సంతృప్తి చెందింది. ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు కేటాయిస్తే తమకు భారీగా ఓట్లు చీలుతాయని భావించిన జనసేన హైకోర్టును ఆశ్రయించింది. Also Read : బండి సంజయ్ ఎన్నికల ప్రచారంపై శశిథరూర్ అభ్యంతరం.. #ap-elections-2024 #janasena #glass-symbol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి