TDP: టికెట్ ఇస్తే ఓకే.. లేదంటే చేసేది ఇదే : మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోతున్నారు ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక సేవలు చేశానన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 26 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి TDP: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోయారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అనేక సేవలు చేసినట్లు వ్యాఖ్యానించారు. 2019లో చంద్రబాబు అదేశాలు ప్రకారం తన సిట్టింగ్ స్ధానం ఉండి నియోజకవర్గాన్ని వదులుకున్నట్లు తెలిపారు. Also Read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ ఎన్నికలు చాలా దగ్గరగా వున్న సమయంలో నరసాపురం ఎంపీగా చంద్రబాబు వెళ్ళమంటే అధినేత నిర్ణయమే శిరోధార్యంగా భావించి వెళ్ళానని అన్నారు. ఎంపిగా పోటీ చేసి ఆర్థికంగా చాలా నష్టపోయానని కామెంట్స్ చేశారు. ఉండి నియోజకవర్గ ప్రజలు తనను కోరుకుంటున్నార్నారు. తన స్ధానం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: టీడీపీ ఇంచార్జ్ ఆత్మహత్య.. భార్య ఎమోషనల్ వీడియో ..! ఉండి నియోజకవర్గ స్ధానం తనకు ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. 2019 తరువాత వైసీపీ వాళ్ళు తనకు అనేక ఆఫర్లు ఇచ్చారని.. అయితే, టీడీపీ అంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు.. తాను ఏనాడూ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. Also Watch This Video: #andhra-pradesh #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి