Andhra Pradesh: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!

ఇటీవల బదిలీ వేటుకు గురైన అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డి.కె. బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌ ను నియమించింది. పలు జిల్లాలకు ఎస్పీలను కూడా నియమించింది.

New Update
Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

Andhra Pradesh: ఏపీలో ఇటీవల పలువురు కలెక్టర్లు, పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది.

కలెక్టర్లు

డికే బాలాజీ - కృష్ణ
వినోద్ కుమార్ - అనంతపురం
ప్రవీణ్ కుమార్ - తిరుపతి

ఐపీఎస్ అధికారులు:

గుంటూరు రేంజ్ ఐజీ - సర్వశ్రేష్ట త్రిపాటి
ప్రకాశం ఎస్పీ - సునీల్
పల్నాడు ఎస్పీ - బింధు
చిత్తూరు ఎస్పీ - మణికంఠ
అనంతపురం ఎస్పీ - అమిత్ బర్ధార్
నెల్లూరు ఎస్పీ - ఆరీఫ్

Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!

ఇదిలా ఉండగా.. ఏపీ డీజీపీ బదిలీకి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీ డీజీపీపై ఈసీ వేటు? వేసే అవకాశం ఉందని సమాచారం. మరో 22 మంది IPSలను తప్పించాలంటూ ఇప్పటికే ఈసీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి, నాన్‌కేడర్‌ ఎస్పీ ఆనంద్‌రెడ్డి వరకు మొత్తం 22 మంది పేర్లు.. వారిపై అభియోగాలను ఈసీకి పురంధేశ్వరి పంపారు. మరి దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు