Janasena: జనసేన ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇవే..ఎవరెవరు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారంటే?

టీడీపీ - జనసేన మొదటి లిస్ట్ లో జనసేన కేవలం 5 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అసలు ఆ జనసేన అభ్యర్ధులు ఎవరు? వారి వయసెంత? వారి స్టడీస్ ఎంటి? ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

New Update
Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్‌..! ట్రోలింగ్‌ ఆగెదెప్పుడు?

Janasena: టీడీపీ - జనసేన నేడు తొలి జాబితాను విడుదల చేసింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించింది. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. అయితే, మొదటి లిస్ట్ లో జనసేన కేవలం 5 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అసలు ఆ జనసేన అభ్యర్ధులు ఎవరు? వారి వయసెంత? వారి స్టడీస్ ఎంటి? ఏ నియోజవకర్గం నుండి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.

• తెనాలి
పేరు: శ్రీ నాదెండ్ల మనోహర్.
వయసు: 58 సం.
విద్యార్హత : ఎం.బి.ఎ.
నేపథ్యం: తెనాలి నుంచి రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రను చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

• నెల్లిమర్ల
పేరు: శ్రీమతి లోకం మాధవి.
వయసు : 54 సం.
విద్యార్హత : ఎం.ఎస్.
నేపథ్యం : ఇస్రోలో ప్రోగ్రామర్ గా, ఫోర్డ్ కంపెనీలో డేటా ఆర్కిటెక్ట్ గా సేవలు అందించారు. అనంతరం మిరాకిల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ సంస్థను స్థాపించారు.. మిరాకిల్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Also Read: తమ్ముళ్లు V/s జనసైనికులు.. హోరెత్తిన నిరసనలు..!

• అనకాపల్లి
పేరు: శ్రీ కొణతాల రామకృష్ణ.
వయసు: 67 సం.
విద్యార్హత : ఎం.కాం.
నేపథ్యం : రెండు దఫాలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

• కాకినాడ రూరల్
పేరు: శ్రీ పంతం నానాజీ.
వయసు : 62.
విద్యార్హత : ఇంటర్మీడియెట్
నేపథ్యం: 2019లో కాకినాడ రూరల్ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా, కాకినాడ రూరల్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేశారు.

• రాజానగరం
పేరు: శ్రీ బత్తుల బలరామకృష్ణ.
వయసు : 50 సం.
విద్యార్హత : 10వ తరగతి
నేపథ్యం: వ్యాపారాలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ప్రస్తుతం రాజానగరం అసెంబ్లీకి జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చూస్తున్నారు. ఈయన భార్య గాదరాడ-2 నుంచి ఎం.పి.టి.సి.గా ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు