Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్‌ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

New Update
Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్

Chegondi Surya Prakash To Join YCP: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రచారాలతో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) కుమారుడు సూర్య ప్రకాష్‌ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2018లో జనసేనలో చేరారు సూర్యప్రకాష్. తాజాగా పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్‌ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.

కాపు ఓట్ల కోసం కంగారు..

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు ఓట్లను నమ్ముకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామజోగయ్య తలనొప్పిగా మారారు. ఇటీవల జనసేన టీడీపీకి దండం.. అంటూ హరిరామజోగయ్య బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు తమకే పడి ఏపీలో అధికారంలోకి వస్తామని అనుకున్న చంద్రబాబుకు షాక్ తగిలింది. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతుండడంతో కాపు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు తలనొప్పి రావడానికి కారణం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సూర్యప్రకాష్ వైసీపీలో చేరిక జగన్ కు లాభం చేకూరిస్తుందా? లేదా కాపుల మద్దతు టీడీపీకే ఉంటుందా? అనేది ఎన్నికల ఫలితాల తరువాతే తెలియనుంది.

మీకో దండం..

కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జనసేన, టీడీపీ పొత్తుపై విసుగు చెందినట్టుగా అర్థమవుతోంది. జనసేనకు కేవలం 24 సీట్లే ఇవ్వడాన్ని అంగీకరించని జోగయ్య ఇటివలి కాలంలో లేఖస్త్రాల సంఖ్యను రెట్టింపు చేశారు. కూటమిలో ప్రాధాన్యత, స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేతకు ఆయన అనేక లేఖలో సలహాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇకపై పొత్తు గురించి పవన్‌తో (Pawan Kalyan) పాటు చంద్రబాబుకు (Chandrababu) సైతం సలహాలు ఇవ్వడం మానేయాలని హరిరామ జోగయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు, పార్టీకి అండగా నిలబడే వారే కావాలి తప్ప వేరే చోట కూర్చొని సలహాలు ఇచ్చే వారు కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు