AP Politics : జగనన్న.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు : షర్మిల సంచలన లేఖ న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది. By Nikhil 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Sharmila : ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కు ఆయన సోదరి, ఏపీపీసీసీ(AICC) చీఫ్, కడప(Kadapa) ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న " నవ సందేహాలకు" సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేఖలో షర్మిల పేర్కొన్న ప్రశ్నలు ఇలా ఉన్నాయి.. 1) ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా ? 2) భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగు భూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపి వేశారు ? 3) 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపివేశారు ? Also Read : జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్! 4) ఎస్సీ,ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ? 5) ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకువచ్చిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు ? 6) దళిత, గిరిజన సిట్టింగ్ MLA లకు ఈ సారి ఎందుకు సీట్లు నిరాకరించారు ? 7) SC,ST లపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి..ఇది మీ వివక్ష కాదా ? 8) దళిత డ్రైవర్ ను చంపి...సూట్ కేసు లో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్శిస్తున్నారు ? 9) స్టడీ సర్కిల్స్ కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ? #aicc #ap-cm-ys-jagan #ys-sharmila-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి