Anantapuram TDP : 'తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయింది..' అనంతపురంలో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు!

అనంతపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమన్నది. టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులు టీడీపీ కార్యాయంలో బీభత్సం సృష్టించారు. కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ డబ్బులకు అమ్ముడుపోయిందని ప్రభాకర్ చౌదరి ఫైర్ అయ్యారు.

New Update
Anantapuram TDP : 'తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయింది..' అనంతపురంలో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు!

టీడీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. సీట్ల పంపకాల్లో భాగంగా టికెట్ దక్కని నేతలు రోడ్లపైకి వస్తున్నారు. నిన్నమొన్నటివరకు పార్టీ జెండాలను తగలబెట్టిన నేతలు ఇప్పుడు పార్టీ ఆఫీస్‌కే నిప్పుపెడుతున్నారు. ముఖ్యంగా అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయనకు కాకుండా అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు ఇవ్వడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ ఎలా దక్కిందని ప్రశ్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏం అన్నారంటే?

--> తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయింది.. డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టికెట్లు.

--> తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదు.

--> ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేశాను.. సొంత ఆస్తులు అమ్ముకున్నాను.

--> ఎవరిని అడిగి చంద్రబాబు దగ్గుబాటి ప్రసాద్ కి టికెట్ ఇచ్చాడు.

--> ఆయన గాంధీ వారసుడా.. లేక ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు.

--> రేపు నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా.

--> చంద్రబాబు పిలిచినా.. ఆయన వద్దకు వెళ్ళను.

--> జిల్లాలో ఇంకా చాలామందికి అన్యాయం చేశారు.

చాలా చోట్ల అదే పరిస్థితి:
అటు చీపురుపల్లి టీడీపీలోనూ ఇదే దుస్థితి ఉంది. కళా వెంకట్రావుకు టికెట్ ఇవ్వడంపై కిమిడి నాగార్జున అనుచరులు భగ్గుమంటున్నారు. తీవ్ర అసంతృప్తితో రోడ్డెక్కి నిరసన తెలిపారు తెలుగు తమ్ముళ్లు. సూపర్ సిక్స్ పాంప్లెంట్ల దహనం చేశారు. కళా వద్దు - నాగార్జున ముద్దు అని నినాదాలు చేశారు. విజయనగరం టీడీపీ అధ్యక్ష పదవికి, చీపురుపల్లి ఇన్‌ఛార్జి పదవికి నాగార్జున రాజీనామా చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

టికెట్ల ప్రకటన:
మరో 4 ఎంపీ సీట్లకు, 9 అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే!

ఎంపీ అభ్యర్థులు:
--> విజయనగరం-అప్పలనాయుడు,
--> ఒంగోలు-మాగుంట శ్రీనువాసులు రెడ్డి,
--> అనంతపూర్- అంబికా లక్ష్మీనారాయణ,
--> కడప-భూపేష్ రెడ్డి

ఎమ్మెల్యే అభ్యర్థులు:
--> భీమిలి-గంటా శ్రీనివాస రావు
--> రాజంపేట-సుభ్రమణ్యం
--> చీపురుపల్లి-కళా వెంకట్రావు
--> గుంతకల్లు-గుమ్మనూరు జయరాం
--> కదిరి-కే.వెంకట ప్రసాద్
--> పాడేరు- కిల్లు వెంకట రమేశ్‌ నాయుడు
--> దర్శి-గొట్టిపాటి లక్ష్మి
--> ఆలూరు వీరభద్రగౌడ్
--> అనంతపురం అర్బన్-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

Also Read: టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు