AP Election Poling: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటెత్తిన ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో గతంలో కంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. కాకినాడ జిల్లాలో 76.37% ..కోనసీమ జిల్లాలో 82.64%..తూర్పుగోదావరి జిల్లాలో 79.43% పోలింగ్ నమోదు అయింది.

New Update
AP Election Poling: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటెత్తిన ఓటర్లు

AP Election Poling: ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల ఉత్సాహంతో పోలింగ్ శాతం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అర్ధరాత్రి దాటేవరకూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్లు పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఉత్సాహంగా ఓట్లు వేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. దీంతో గతంలో కంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. కాకినాడ జిల్లాలో 76.37% ..కోనసీమ జిల్లాలో 82.64%..తూర్పుగోదావరి జిల్లాలో 79.43% పోలింగ్ నమోదు అయింది. ఇక కోనసీమ జిల్లాలో అర్ధరాత్రి 12 గంటల వరకూ పోలింగ్ జరిగింది. పోలింగ్ లేట్ అవడానికి కారణం ఈవీఎంలు మొరాయించడమే అని అధికారులు చెబుతున్నారు. 

Also Read: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!

AP Election Poling: ఉభయ గోదావరి జిల్లాలో పోలింగ్ వివరాలు.. 

  • కోనసీమ జిల్లలోని మండపేటలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 
  • తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పోలింగ్ శాతం పెరగడం విపరీతమైన ఎండ కారణంగా ఇక్కడ పోలింగ్ ఆలస్యమైంది. 
  • రాజమండ్రి అర్బన్ కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదు అయినప్పటికీ  ముగిసేసరికి రాత్రి 11:30 దాటింది. 
  • కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ లో ఓటింగ్ ముగిసేసరికి అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అక్కడక్కడ కొన్ని బూతులలో మిషన్ లు  పనిచేయకపోవడం తో పోలింగ్ ఆలస్యం అయిన పరిస్థితి ఇక్కడ ఉంది. 
  • పిఠాపురంలో కూడా విరవ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద రాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇక్కడ కూడా తరచూ ఈవీఎం మిషన్లు మొరాయించడంతో బాగా పోలింగ్ బాగా ఆలస్యమైంది. 
  • మండపేట, రాజానగరం, రాజమండ్రి అర్బన్, కాకినాడ అర్బన్ లోనూ అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. విపరీతమైన ఎండల కారణంగా పోలింగ్ ఇక్కడ ఆలస్యం అయిందని తెలుస్తోంది. 
Advertisment
Advertisment
తాజా కథనాలు