AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స.

New Update
Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స

AP DSC and TET Notification: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) శుభవార్త చెప్పారు. టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) భర్తీపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ముందు టెట్ (AP TET), ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందని ప్రకటించారు బొత్స.
ఇది కూడా చదవండి: AP Capital Shifting :విశాఖకు రాజధాని…సంచలన జీవో జారీ

ఇదిలా ఉంటే.. బైజుస్ (Byjus) తో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని తెలిపారు. 5.18 లక్షల ట్యాబ్ లు 8 తరగతి విద్యార్థులకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది మూడేళ్ల కు సంబధించిన కంటెంట్ ను ట్యాబ్ ల్లో పెట్టి ఇస్తామన్నారు. ఈ అంశంలో స్టూడెంట్స్, పేరెంట్స్‌ లో గందరగోళం సృష్టించవద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నానన్నారు. టోఫెల్ కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు. సెలబ్రిటీ పార్టీగా ఉన్న ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: APSPDCL: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు

చంద్రబాబు అరెస్ట్ పై కూడా మంత్రి బొత్స స్పందించారు. ఆయన ఎప్పుడు బయటకు ఎప్పుడు వస్తారో నాకేం తెలుసన్నారు. ఆ విషయం చెప్పడానికి నేనేమైనా జడ్జి ఆత్మనా.. అంటూ తనదైన శైలిలో వాఖ్యానించారు. లోకేష్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తన బాధలు చెప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ అమిత్ షా ను కలిసి జగన్ తనను వేధిస్తున్నాడు అని చెప్పకపోతే.. జగన్ ప్రేమిస్తున్నాడని చెబుతాడా? అంటూ సెటైర్లు వేశారు బొత్స.

Advertisment
Advertisment
తాజా కథనాలు