AP: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చూసుకోండి!

ఏపీ ఈఏపీసెట్‌ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

New Update
AP: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చూసుకోండి!

AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకోసం మే 16 నుంచి 23వరకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలను అధికారులు రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా.. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఎపిఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో (75.51 %) 1,95,092 మంది విద్యార్ధులు ఉత్తీర్ణ సాధించారు. అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో ( 87.11% ) 70,352 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. ఇక ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి సాధించగా.. రెండవ ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి సాధించాడు. మూడో ర్యాంకు భోగలాపల్లి సందీష్. అగ్రికల్చర్ లో ఫస్ట్ ర్యాంక్ యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ), రెండవ ర్యాంక్ దివ్యతేజ, మూడవ ర్యాంక్ వడ్లపూడి ముకేష్ చౌదరి సాధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు