/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T140141.385-jpg.webp)
AP DSC Application Date Extended: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ఈ నెల 23న ఒంగోలుకు సీఎం జగన్.. ఆ రోజే ఇళ్ల పట్టాల పంపిణీ
ఫిబ్రవరి 12న నోటిఫికేషన్..
ఆంధ్రా లో డీఎస్సీ నోటిపికేషన్(DSC Notification) ను విడుదల చేశారు. మొత్తం 6,100 పోస్టులకు ప్రభుత్వం నోటిపికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న పలితాలను ప్రకటించనున్నారు. 2018 ప్రకారమే పరీక్షల సిలబస్ ఉంటుందని మంత్రి బొత్స(Minister Botsa Satyanarayana) తెలిపారు. జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు వయో పరిమితి 44 ఏళ్ళు… ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) లకు అదనంగా మరో ఐదేళ్ళ సడలింపును ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటూ 1264 టీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులకు కూడా నోటిపికేషన్ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపునే అన్ని నియామకాలను పూర్తి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. అంతేకాకుండా ప్రతీ విద్యా సంవత్సరంలో ఖాళీలను కచ్చితంగా ఫిలప్ చేస్తామని చెప్పారు.
–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ..
–> టెట్ పరీక్ష(TET Exam) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు
–> మార్చి 5న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్
–> మార్చి 14న టెట్ రిజల్ట్
–> మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
–> మార్చి 31న డీఎస్సీ ప్రాధమిక కీ విడుదల
–> ఏప్రిల్ 2న ఫైనల్ కీ
–> ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటన
–> అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలోని ఖాళీలను భర్తీ
–> 6100 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం
–> ఫిబ్రవరి 12 తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాలు వెల్లడి..
–> 2280 ఎస్జీటీ పోస్టులను
–> 2299 స్కూల్ అసిస్టెంట్ లు
–> 1264 టీజీటి .
–> 215 పిజిటి లు
–> 242 ప్రిన్సిపాల్ నియామకం