AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు!

ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

New Update
Telangana : తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఇవే చివరివి!

Summer : ఏపీ(Andhra Pradesh) లో సూర్యుడు(Sun) రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు(Heat Waves) తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రేపు 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్(Kurmanath) వివరించారు. శ్రీకాకుళం , విజయనగరం , పార్వతీపురంమన్యం, విశాఖ , అనకాపల్లి మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశాలున్న మండలాలు:

శ్రీకాకుళం , విజయనగరం , పార్వతీపురంమన్యం , అల్లూరిసీతారామరాజు , విశాఖ , అనకాపల్లి , కోనసీమ , కాకినాడ , తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి ఏలూరు , కృష్ణా , ఎన్టీఆర్ , గుంటూరు , పల్నాడు , బాపట్ల , ప్రకాశం , శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు , శ్రీసత్యసాయి , వైయస్సార్ , అన్నమయ్య , తిరుపతి మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులో అత్యధికంగా 47.7 డిగ్రీలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్దకన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచాలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వివరించారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని వైద్యాధికారులు వివరించారు.

Also read: ఏఐ నియంత్రిత యుద్ద విమానాన్ని పరీక్షించిన అమెరికా!

Advertisment
Advertisment
తాజా కథనాలు