CM Jagan: సతీసమేతంగా లండన్ పర్యటనలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి

New Update
CM Jagan: సతీసమేతంగా లండన్ పర్యటనలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కు వీడ్కోలు పలికారు. పది రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 12న తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ ఏపీ రాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది.

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి..

ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ఆగస్టు 30న విచారణ చేపట్టిన న్యాయస్థానం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనలకు వెళ్లడం కోసం ఆయన అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కూడా విదేశాలకు వెళ్లనున్నారు.

అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదన..

గతంలో అక్రమాస్తుల కేసుల్లో అరెస్టై పలు షరతులతో ఇద్దరు బెయిల్‌పై విడుదల అయ్యారు. ఆ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలనే నిబంధన ఉంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే వీరిద్దరూ కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి. జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ వాదించినట్లు తెలుస్తోంది. కేసులలో సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశముందని, విదేశీ టూర్‌కు అనుమతివ్వొద్దని వివరించింది. అయితే సీబీఐ న్యాయస్థానం మాత్రం వారికి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు