ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నారు. అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

New Update
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ!
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Patanjali Chilli Powder

Patanjali Chilli Powder

Patanjali Chilli Powder: యోగా గురువు బాబా రాందేవ్(Baba Ram Dev) సారథ్యంలో పనిచేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి తయారీ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) నిర్ధారించింది. దీంతో  వల్లే ఆ కారం పొడిని వెనక్కి తీసుకోవాలని పతంజలి ఫుడ్స్‌కు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది. దీంతో ఆ పొడిని వెనక్కు తీసుకోవాలని ఆదేశించింది. ఏజేడీ2400012 బ్యాచ్‌కు చెందిన 200 గ్రాముల 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తోంది. 

Also Read: Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

మోతాదుకు మించి క్రిమిసంహారకాలు..

పతంజలి ఫుడ్స్‌ సీఈవో సంజీవ్‌ ఆస్థానా ఈ విషయాన్ని ధృవీకరించారు. "మేము మార్కెట్‌ నుంచి 200 గ్రాములకు చెందిన 4 టన్నుల  కారం పొడి ప్యాకెట్లను వెనక్కు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కారం పొడి ప్యాకెట్లలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తేల్చి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Also Read: ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

వినియోగదారులు కొనుగోలు చేసిన మిర్చి పౌడర్‌ను మా డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు తీసుకుంటారు. ఆ వెంటనే వారికి వారి డబ్బులు తిరిగి చెల్లి్స్తారు అని తెలిపారు. అలాగే మేము మిర్చి కొనుగోలు చేస్తున్న సంస్థలతో మాట్లాడుతాం. పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉండకుండా జాగ్రత్తపడుతాం. ఇప్పటి నుంచి భారత ఆహార భద్రతా(Food Safety) ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSI)  ప్రమాణాలకు అనుకూలంగా ఉండే మిర్చిని మాత్రమే కొని పొడి తయారు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read: MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన బాబా రాందేవ్ 1986లో ఈ పతంజలి ఆయుర్వేద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రుచి గోల్డ్, న్యూట్రెలా, పతంజలి పేర్లతో వివిధ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తుంది. కాగా గతేడాది జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ నికర లాభం 21 శాతం మేర పెరిగి రూ.308.97 కోట్లకు చేరింది. దాని నికర లాభం రూ.254.53 కోట్లుగా నమోదైంది.  

Also Read:  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

Advertisment
Advertisment
Advertisment