CM Chandrababu: ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.

New Update
CM Revanth Reddy: ఎల్లుండి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

CM Chandrababu And Revanth Reddy: ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ (Global Summit 2024) హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.

కాగా ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారని అందరు అనుకున్నారు. కానీ, రాజకీయ కారణాల వల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రాణస్వీకారానికి హాజరు కాలేదు. దాదాపు పదేళ్ల తరువాత ఇద్దరు సీఎం హోదాలో కలుసుకోనున్నారు.

Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

Advertisment
Advertisment
తాజా కథనాలు