చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ సీఐడీ మరో కొత్త కేసు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ ఆయనపై మరో కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద నమోదు చేసిన ఈ కేసులో ఆయనను A3గా చేర్చింది.

New Update
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ సీఐడీ మరో కొత్త కేసు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న చంద్రబాబుకు (Chandrababu) మరో బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ (AP CID). ఆయనపై మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై కేసును నమోదైంది. పీసీ యాక్ట్ కింద ఈ కేసును సీఐడీ అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ ఏ3గా చేర్చింది. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ కేసులో A1 గా నరేష్, A2 గా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్‎డేట్..!!

ఇదిలా ఉంటే.. స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించి దాఖలైన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. చంద్రబాబు అనారోగ్య కారణాల రిత్యా కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ సీఐడీ మరో కొత్త కేసును చంద్రబాబుపై నమోదు చేయడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ చేస్తున్న కుట్రలో భాగంగానే కేసులు నమోదు అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కొత్త కేసు విషయంలో సీఐడీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనే అంశం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు