AP CEO: ఎందుకింత నిర్లక్ష్యం.. ఆ మూడు జిల్లాల ఎస్పీలకు ఈసీ వార్నింగ్!

నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సమావేశం ముగిసింది. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం వహించారని వారిని సీఈఓ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

New Update
AP CEO: ఎందుకింత నిర్లక్ష్యం.. ఆ మూడు జిల్లాల ఎస్పీలకు ఈసీ వార్నింగ్!

AP CEO Warns SP's: ఏపీ సీఈఓతో నంద్యాల (Nandyala), ప్రకాశం (Prakasham), పల్నాడు (Palnadu) జిల్లాల ఎస్పీల భేటీ ముగిసింది. ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి సీఈఓ వివరణ తీసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎందుకు అలక్ష్యం వహించారని సీఈఓ వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏకంగా హత్యలు జరిగే వరకు పరిణామాలు దారి తీయడం పట్ల ఏపీ సీఈఓ అసహనం వ్యక్తం చేశారు. మాచర్ల చాలా కాలంగా సెన్సిటీవ్ గా ఉన్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ఆ జిల్లా ఎస్పీని సీఈఓ మీనా (CEO Mukesh Kumar Meena) ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన

ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందని వారికి తెలిపినట్లు సమాచారం. ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈఓ ఎంకే మీనా పంపనున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో 3 జిల్లాల ఎస్పీలపై ఈసీ సీరియస్‌ గా ఉంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది ఈసీ. చాగలమర్రి, గిద్దలూరులో హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై వివరణ కోరింది. హింసాకాండ వెనుక ఉన్న వ్యక్తుల పూర్తి సమాచారంతో వచ్చి వివరణ ఇవ్వాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు