Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లతోపాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

AP Forest Department Jobs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో (Cabinet Meeting) ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ డీఎస్సీ (AP DSC) నిర్వహణ నోటిఫికేషన్లపై కూడా చర్చించారు. మొత్తం 6100 టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

అటు వైద్యారోగ్య శాఖలోనూ పలు ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఏపీ కేబినెట్ మంత్రివర్గం అసెంబ్లీఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అయ్యింది. రైతు భరోసా, జీరో వడ్డీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటబీమా కలిపి 4వేలకోట్ల బకాయిలు అక్టోబర్ నెలలో చెల్లిస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం డీఎస్సీ నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వంటి అంశాలపై మంత్రి వర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది. అటు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు వంటి అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: రూ.14వేలలోపే బ్రాండెడ్ ఫోన్ కావాలా?అయితే వన్ ప్లస్ 5జీఫోన్ బెటర్ ఆప్షన్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు