AP BJP: ఏపీలో జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాబోయే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని వస్తున్న వార్తలను ఖండించారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. By V.J Reddy 01 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి AP BJP Chief Purandeswari: మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే లోక్ సభతో (Lok Sabha) అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జనసేనతో (Janasena) కలిసి పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) క్లారిటీ ఇచ్చారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ఉండబోతుంది అని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు పురందేశ్వరి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. భీమవరం కేంద్రంగా 25 పార్లమెంటు కార్యాలయాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికల శంఖారావం ప్రారంభించాం అని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే లోక్ సభతో అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఘన విజయం సాధిస్తాం అని పేర్కొన్నారు. ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన రాజధాని లేకపోవడం సిగ్గుచేటు.. గత ప్రభుత్వాలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. తల లేని మొండెంగా ఏపి మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. గుళ్ళు కాదు గుళ్ళల్లో విగ్రహాలు ద్వంసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే అని పేర్కొన్నారు. 9,10,11 తేదీల్లో పల్లెలు పోదాం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఒక ప్రకటన.. పొత్తులపై కేంద్ర నాయకత్వం చూస్తూందని అన్నారు పురందేశ్వరి. త్వరలోనే పొత్తులపై బీజేపీ అధిష్టానం ప్రకటన చేస్తుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జనసేన తో కలిసి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. ఒక సాధారణ కార్యకర్త ప్రధాని కావడం.. బీజేపీలోనే సాధ్యం అని అన్నారు. బీజేపీలో (BJP) వారసత్వ రాజకీయాలకు తావు లేదని వ్యాఖ్యానించారు. వైసిపి సిద్ధం సభలు ఉద్దేశం ఏపిని దోచుకోవడానికి సిద్దమా? అని ఎద్దేవా చేశారు. ALSO READ: ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి? DO WATCH: #janasena #ap-bjp-chief-purandeswari #ap-latest-news #janasena-bjp-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి