AP Assembly: 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్ ఎవరో తెలుసా?

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఏడు సార్లు విజయం సాధించి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

New Update
AP Assembly: 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్ ఎవరో తెలుసా?

ఏపీలో కొత్త ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. సీఎంగా చంద్రబాబునాయిడితో పాటు మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఆ తర్వాత ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం రెండో రోజు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ ఎవరనే అంశంపై తీవ్ర ఆసక్తి వ్యక్తం అవుతోంది. సభలో సీనియర్ సభ్యుడికి ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు ఇవ్వడం ఆనవాయితీ. దీంతో రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య, చంద్రబాబు సీనియర్లుగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు