CM Chandrababu: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే! 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగి వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ స్టోరీ! By Trinath 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Chandrababu 4th Time CM: అది 2019, మే 23.. ఏపీ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లకు విపరీతమైన బాధ కలిగించిన రోజు..! తెలుగుదేశం కేడర్‌ను నిరాశ కమ్మేసిన కాలమది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైనట్టు ఫలితాలు వచ్చాయి. ఇది చంద్రబాబుకు భారీ ఎదురుదెబ్బ. ఇక టీడీపీ కోలుకోదని.. చంద్రబాబు పనైపోయిందని విశ్లేషణలు మొదలయ్యాయి. సీన్ కట్ చేస్తే.. 2024 జూన్ 4.. తెలుగుదేశం దుమ్మురేపింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. దీంతో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ఎలా పని చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబుకు ప్రధానిపదవీ ఆఫర్? తెలుగుదేశం పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయంగా చెప్పవచ్చు. రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. నిజానికి తనకు ప్రధాని పదవీ ఆఫర్ అనేకసార్లు వచ్చిందని.. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ అత్యున్నత పదవీని వదులుకున్నానని చంద్రబాబు అనేకసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చంద్రగిరి నుంచి మొదలు: ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు చంద్రబాబు నాయుడు జన్మించారు. పొరుగు గ్రామమైన శేషాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం. చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏలో ఉత్తీర్ణత సాధించిన చంద్రబాబు.. 1974లో ఆర్థిక శాస్త్రంలో ఎమ్.ఏ. ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఇక 1977లో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా.. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1984 మే 27న తన మావయ్య ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబు టీడీపీలో తనదైన మార్క్ చూపించారు. ఎన్టీఆర్‌కు అన్నివిధాల అండగా నిలిచారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించారు. దేశరాజకీయాల్లో కీలక పాత్ర: ఓవైపు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తునే.. మరోవైపు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు చంద్రబాబు. 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు చంద్రబాబు. 1996 జూన్ 1న దేవెగౌడను ప్రధాని చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఎంపికలో చంద్రబాబు ముఖ్యపాత్ర పోషించారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఇక 1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఎన్డీఏ ఏర్పాటైంది.1998 నవంబర్ 22న ప్రధాని వాజపేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది హైదరాబాద్ సిటీ రూపురేఖలను మార్చేసిందని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతుంటారు. చంద్రబాబు తల్లిదండ్రులు నాడు మోదీకి యాంటి: మరోవైపు రాజకీయంగా చంద్రబాబుపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పదేపదే స్టాండ్ మార్చుకుంటారన్న ఆరోపణలున్నాయి. 2014లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు.. 2019 నాటికి మోదీకి యాంటీగా మారారు. మళ్లీ 2024నాటికి అదే మోదీ పక్షాన నిలబడి ప్రచారం చేశారు. గోడకేసి కొట్టిన బంతిలా.. ఇక 45ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎంతో హూందాగా వ్యవహరించారు. ఇటు 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారాయన. అటు జనసేన ఇటు బీజేపీతో కలిసి పదునైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి చంద్రబాబు వైసీపీని ఓడించి మరో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేందుకు సిద్ధమయ్యారు. #chandrababu-naidu #ys-jagan #ap-assembly-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి