ఆ సినిమా వల్లే రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. అనురాగ్‌ కశ్యప్‌

‘మ్యాగ్జిమమ్‌ సిటీ’ ప్రాజెక్ట్ ఆగిపోవడంవల్లే తనకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పారు. ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగడం తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్ని కోల్పోయినందుకు మానసికంగా కుంగిపోయా అన్నారు.

New Update
ఆ సినిమా వల్లే రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. అనురాగ్‌ కశ్యప్‌

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ‘మ్యాగ్జిమమ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడం తనని ఎంతగానో బాధకు గురి చేసిందంటున్నారు. సుకేతు మెహతా రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కిన ఈ మూవీ అనుకోని కారణాలతో నిలిచిపోయింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు అనురాగ్‌.

Also read :దానివల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.. అనన్యాపాండే

‘నేను చాలా సినిమాలు తీయడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్ట్‌ కోసం చాలా కష్టపడి వర్క్‌ చేశాను. నిజంగా చెప్పాలంటే ఇదే నా బెస్ట్‌ వర్క్‌. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగింది. ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. మానసిక కుంగుబాటుకు గురై అతిగా మద్యం సేవించా. ఆ సమయంలో రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా. ఏదైమైనా నేను దాన్ని కోల్పోయాను’ అంటూ గతన్ని తలచకుంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే స్టార్ హీరోలతో సినిమాలు చేయడంపై కూడా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో స్టార్ల వెంటపడడం తప్పలేదు. స్టార్లు లేకుండా నువ్వు ఈ ప్రాజెక్టు చేస్తున్నావ్‌.. ఒకవేళ ఇదే మూవీలో స్టార్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో అని చాలామంది నాకు సలహా ఇచ్చేవారు. స్టార్లుగా పేరొందిన వారికి అశేష అభిమానులుంటారు. ఆ అభిమానులను దృష్టిలో పెట్టుకోవడం వల్ల స్టార్లతో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించడం కష్టం. అందుకే షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి వారితో సినిమాలు చేయాలనుకోను. విదేశీ దర్శకులు హీరోల అభిమానుల కోసం సినిమాలు తీయరు. అక్కడ స్వేచ్ఛ ఉంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. ఇక ఇటీవల ఇక ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘నో స్మోకింగ్‌’, ‘బాంబే వెల్వెట్’, ‘దోబారా’ వంటి చిత్రాలకు అనురాగ్‌ దర్శకత్వం వహించగా సన్నీలియోనీ, రాహుల్‌ భట్‌తో ఇటీవల ‘కెన్నెడీ’ నిర్మించారు. జీ 5 వేదికగా విడుదలైన ఈ చిత్రం ఊహించినంత విజయం సాధించలేకపోయింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan Peddi: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న "పెద్ది" చిత్రం గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. థియేట్రికల్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డు ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.

New Update
Ram Charan Peddi

Ram Charan Peddi

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దేవర బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu Sana) కలిసి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "పెద్ది". ఈ సినిమా ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. అప్పటివరకు అంతగా లేని క్రేజ్ గ్లింప్స్‌ విడుదయాలయ్యాక అమాంతం పెరిగిపోయింది.

Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'

"పెద్ది" కు థియేట్రికల్, ఓటిటి లలో కూడా భారీ ఆఫర్లను వస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే "పెద్ది" భారీ రికార్డులు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న అంచనాలను మించేలా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు

అలాగే, ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు ఆఫర్ కూడా "పెద్ది" సినిమాకు ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తోంది. మరి రిలీజైనా తరువాత ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

Advertisment
Advertisment
Advertisment