MLA Adimulam: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.!

వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తన తనయుడు సుమన్ కుమార్ తో కలిసి నేడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

New Update
MLA Adimulam: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.!

MLA Koneti Adimulam: ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. తన తనయుడు సుమన్ కుమార్ తో కలిసి నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..!

కాగా,  ఎమ్మెల్యే ఆదిమూలం రిసెంట్ గా సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సత్యవేడు ఎమ్మెల్యేగా టికెట్ కాకుండా ఎంపీ టికెట్ కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను ఎందుకు ఎంపీలుగా ఎన్నికల బరిలో దింపుతున్నారని ప్రశ్నించారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని ఆరోపణలు చేశారు. సత్యవేడు నియోజకవర్గ భేటీని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో పెడుతారా? అని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు అతి భారీ షాక్‌.. పదేళ్లు జైలుశిక్ష!

మంత్రి పెద్దిరెడ్డి కుట్రలో భాగంగా తనకు టికెట్ రాలేదని ఒక సెల్ఫీ వీడియో(Selfie Video) ను విడుదల చేశారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. ఈ వీడియోను చూసిన అధిష్టానం అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుండగా ఇంతలోనే అతడు లోకేష్ ను కలవడంతో పార్టీ మారడం ఫిక్స్ అని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే, టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు