Rajya Sabha: బీజేపీకి షాక్… రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం

రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం తగ్గింది. మెజారిటీ మార్క్‌ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్‌ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి.

New Update
Rajya Sabha: బీజేపీకి షాక్… రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం

Rajya Sabha: రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే (NDA) సంఖ్యా బలం తగ్గింది. మెజారిటీ మార్క్‌ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్‌ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి. మరోవైపు ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో (Telangana) ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కు (Congress) రాజ్యసభలో మరో సీటు లభించినట్టు అయింది. ఇదిలా ఉంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇటీవల మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపుతుందో వేచి చూడాలి.

Also Read: డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్‌ స్వాధీనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

New Update
CM Revanth Team in Japan

CM Revanth Team in Japan


సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.

Also Read: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా  ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.   

Also Read: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్‌ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్‌ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు ఉన్నారు. 

Also read: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

 telugu-news | rtv-news | cm revanth | japan 

 

Advertisment
Advertisment
Advertisment