MLC Kavitha : కవితకు మరో షాక్

లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు మధ్యంతర బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది.

New Update
MLC Kavitha : కవితకు మరో షాక్

Liquor Scam Case : లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలు(Tihar Jail) లో ఉన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని అందుకుగాను తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది. ఏప్రిల్ 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించనుంది. కాగా.. కవితను ఈరోజు బెయిల్ వస్తుందని ఆశించించిన బీఆర్ఎస్ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. మరి కవితకు కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

కోర్టులో ఈడీ వాదనలు ఇలా..

* బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ

* కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఈడీ

* ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సాక్ష్యుల్ని కవిత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు- ఈడీ

* లిక్కర్‌ స్కామ్‌లో కవితకు సంబంధించిన ఆధారాలను.. నేరుగా జడ్జికి చూపెట్టిన ఈడి అధికారులు

* కవిత ప్లాన్‌ మేరకే రూ. 100 కోట్లు ఆప్‌కు లంచంగా ఇచ్చారు

* కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు

* కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేశారు

* వాట్సప్, ఫేస్ టైముల డేటా కూడా లేదు

* మేం నోటీసులు ఇచ్చాక 4 ఫోన్లలో డేటా ఫార్మాట్ చేశారు-ఈడీ

* డిజిటల్ ఆధారాలు(Digital Proofs) లేకుండా జాగ్రత్తపడ్డారు

* లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న టైమ్‌లో.. కవితకు బెయిల్ ఇస్తే విచారణ కు ఇబ్బంది- ఈడీ

* లిక్కర్‌స్కామ్‌లో అరుణ్ పిళ్ళై కవితకు బినామీగా ఉన్నారు

* ఇండో స్పిరిట్‌లో 33 శాతం వాటా కవిత, అరుణ్‌ పిళ్లైదే..-ఈడీ

* దినేష్ అరోరా అఫ్రూవర్‌గా మారాక అన్ని విషయాలు చెప్పాడు

* కవిత ప్లాన్‌ మేరకే రూ. 100 కోట్లు ఆప్‌కు లంచంగా ఇచ్చారు

Advertisment
Advertisment
తాజా కథనాలు