CM Chandrababu : చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం AP: చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్న అధికారులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తాజాగా ఐఏఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై వేటు వేసింది బాబు సర్కార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోలా భాస్కర్ ను నియమించింది . By V.J Reddy 17 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి CM Chandrababu Took Decision : చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ (Praveen Prakash) పై వేటు వేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోలా భాస్కర్ ను నియమించింది. ప్రవీణ్ ప్రకాష్‌ను తప్పించి పోలా భాస్కర్ (Pola Bhaskar) ను ప్రభుత్వం నియమించింది. కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్న అధికారులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2 రోజుల కిందట శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). శ్రీలక్ష్మి నుంచి బోకే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారు. ఇప్పటికే జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల ఆదేశం ఇచ్చారు. ఆమెను బదిలీ చేసేంత వరకు పైళ్లు పంపకూడదని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ తర్వాత సంతకం పెట్టించేందుకు ఫైల్ తెచ్చిన శ్రీలక్ష్మి.. ఇప్పుడే ఫైళ్లపై సంతకాలు పెట్టానని మంత్రి నారాయణ తెలిపారు. Also Read : ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఈరోజు.. పనులు పరుగులు పెడతాయా? #andhra-pradesh #ap-tdp #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి