Hyderabad Hit And Run : హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లో వైడ్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చి ఎదురుగా ఉన్న రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బైక్ మీద ఉన్న అన్నాచెల్లెళ్లకు తీవ్రగాయాలు కాగా, మరో బైక్ మీద ఉన్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. By Bhavana 01 Feb 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hit And Run : హైదరాబాద్(Hyderabad) లో ఈ మధ్య కాలంలో హిట్ అండ్ రన్(Hit And Run) కేసులు ఎక్కువ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్(Jubilee Hills) పెద్దమ్మ గుడి(Peddamma Temple) వద్ద బైకును కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటన ఇంకా మరువక ముందే మరో ఘటన నగరంలో కలకలం రేగింది. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లో వైడ్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చి ఎదురుగా ఉన్న రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బైక్ మీద ఉన్న అన్నాచెల్లెళ్లకు తీవ్రగాయాలు కాగా, మరో బైక్ మీద ఉన్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిపిన కారు వివరాలు కానీ, అందులోని వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అసలు స్పోర్ట్స్ కారు ఆ సమయంలో ఎందుకు అంత స్పీడుగా వచ్చింది. ఈ ప్రమాదం జరగడానికి కారణం..మద్యం మత్తా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also read: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా! #hyderabad #jubilee-hills #hit-and-run సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి