Andrew Flintoff Birthday: ఫుల్లుగా తాగి సముద్రంలో పడి.. చచ్చి బతికిన క్రికెటర్.. ఇంగ్లాండ్ క్రికెటర్ ప్లింటాఫ్ ఓక టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో పార్టీలో మందు ఎక్కువై.. సముద్రంలో చిక్కుకున్నాడట. హోటల్ సిబ్బంది రక్షించి తనని రూమ్ కు చేర్చారని అతనే స్వయంగా సంఘటన జరిగిన ఏడేళ్ల తరువాత చెప్పాడు. పూర్తి కథ తెలియాలంటే పై హెడింగ్ క్లిక్ చేయండి. By KVD Varma 06 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Andrew Flintoff Birthday: మన క్రికెటర్లు ఫర్లేదు కానీ, ఇతర దేశాల్లో మాత్రం అవకాశం దొరికితే రచ్చ రచ్చ చేసేస్తూ ఉంటారు. అందులోనూ ఇంగ్లాండ్ క్రికెటర్లు మరీ అరాచకంగా ఉంటారు. ఎంజాయ్ చేయడంలో వారి తరువాతే ఏ క్రికెటరైనా. ఇదిగో అలాంటి ఎంజాయ్మెంట్ లో ప్రమాదం బారిన పడి బతుకు జీవుడా అని బయటపడ్డ ఇంగ్లాండ్ క్రికెటర్ గురించే ఈ స్టోరీ. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. టెస్ట్ ఫార్మాట్ అయినా లేదా ODI అయినా, ఫ్లింటాఫ్ తన జట్టుకు చాలాసార్లు ట్రబుల్ షూటర్‌గా మారాడు. అతని ఎంజాయిమెంట్ స్టోరీస్ కూడా అతని లానే ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉంటాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6న, ఆండ్రూ ఫ్లింటాఫ్ తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్లింటాఫ్ తానే చెప్పిన తన ఎంజాయ్మెంట్ స్టోరీని తెలుసుకుందాం. వన్డే ప్రపంచకప్ పోటీలు 2007లో జరుగుతున్న సమయంలో.. ఆరోజు మార్చి 18వ తేదీ.. కెనడాతో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దానికి ఒక రోజు ముందు రాత్రి అంటే మర్చి 16న ఒక మర్చిపోలేని సంఘటన ప్లింటాఫ్ కి ఎదురైంది. ఆరోజు ఇంగ్లాండ్ క్రికెటర్లు కొందరు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ కూడా బాధతో చేసుకున్నారు. బాధ ఎందుకంటే.. ఆరోజు న్యూజీలాండ్ చేతిలో ఇంగ్లాండ్ టీమ్ ఓడిపోయింది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌కి ఇది మొదటి మ్యాచ్, ఆ జట్టు కేవలం 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ప్లింటాఫ్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు, మొదటి బంతికే షేన్ బాండ్ అతనిని అవుట్ చేశాడు. Also Read: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా.. దీంతో ఆ బాధలో కొందరు క్రికెటర్లు పీకలదాకా మందు తాగేశారు. సమయంలో ప్లింటాఫ్ కూడా ఒళ్ళు తెలియనంతగా ఫుల్లుగా మందేశాడు. దాదాపుగా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో రాత్రి 2గంటల సమయంలో ఒంటరిగా సముద్రం వైపు వెళ్ళాడు. అక్కడ ఒక పడవ కనిపిస్తే అది ఎక్కి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఆ పడవ ఎందుకు ఎక్కడంటే, అక్కడ ఇయాన్ బోథమ్ వున్నాడని అనుకున్నాడట. అతని వద్ద మరింత మందు దొరుకుతుంది అని తూగుతూ ఆ పడవ ఎక్కేశాడు. అప్పుడు అసలు కథ మొదలైంది. ఆ పడవ సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలో చిక్కుకున్న అతన్ని అదృష్టవశాత్తూ.. హోటల్ సిబ్బంది చూసి కాపాడి రూమ్ కి తీసుకువచ్చి పడుకో పెట్టి వెళ్లిపోయారు. ఈ స్టోరీ అంతా ప్లింటాఫ్ స్వయంగా చెప్పాడు. ఈ సంఘటన జరిగిన ఏడేళ్ల తరువాత దీనిని బయటపెట్టాడు. తాను ఆ తాగిన మత్తులో ఏమి చేశానో సరిగా గుర్తు లేదని చెప్పిన ప్లింటాఫ్.. తనకు పడవలో ఇయాన్ బోథమ్ ఉన్నాడని.. మందు కోసం అతని దగ్గరకు వెళ్లాలని అనుకున్నట్టు మాత్రమే గుర్తుందని చెప్పాడు. కట్ చేస్తే.. తాను ఉదయం లేచేసరికి తన బెడ్ అంతా తడిచిపోయి ఉందనీ.. మొత్తం రూమంతా ఇసుక చల్లినట్టు ఉందని చెప్పాడు. అదీ ప్లింటాఫ్ ఎంజాయ్మెంట్ స్టోరీ. హోటల్ సిబ్బంది చూశారు కాబట్టి సరిపోయింది. లేకపోతె ఈ స్టోరీ అప్పుడెప్పుడో చెప్పేసుకునేవారం కదా. కొసమెరుపేమిటంటే.. మర్నాడు జింబాబ్వేతో మ్యాచ్ లో ప్లింటాఫ్ ఆడలేదు. (ఇంకేం ఆడతాడు హ్యాంగోవర్ కదా). ఆ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ కూడా చేరుకోలేదు. మరి టోర్నమెంట్ మధ్యలో తాగి తందానాలు ఆడితే గెలుస్తారా ఏమిటి? అని అడగవద్దు. హ్యాపీ బర్త్ డే ప్లింటాఫ్! Watch this interesting Video: #england-cricket-team #andrew-flintoff మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి