ఏపీలో ‘జై తెలుగు’ పార్టీని ప్రకటించిన జొన్నవిత్తుల

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటికే ప్రాంతీయ, జాతీయ పార్టీలతో పాటుగా.. భాషా పరిరక్షణ కోసం కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నూతనంగా ‘జై తెలుగు’ పార్టీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కొత్త పార్టీ పుట్టుకరావడంతో ఏపీలో రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

New Update
ఏపీలో ‘జై తెలుగు’ పార్టీని ప్రకటించిన జొన్నవిత్తుల

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పార్టీని ఏర్పాటు చేసినట్టు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంగళవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. తెలుగు భాషా, సంస్కృతి కోసం ప్రత్యేకంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు భాషా, సంస్కృతి కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

పార్టీ జెండా, గుర్తులు

ప్రజలకు, రాజకీయ నేతలకు సరైన అవగాహన కల్పించడమే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. జై తెలుగు పార్టీకి ఐదు రంగులు కలిగిన జెండాను రూపొందించినట్టు జొన్నవిత్తుల తెలిపారు. జెండాలో నీలం, పచ్చ, ఎరుపు, బంగారు వర్ణం, తెలుపు రంగులు ఉంటాయని, జెండా వెనుక రథం గుర్తు ఉంటుందని తెలిపారు. ఈ ఐదు రంగులు ఐదు విషయాలను తెలియజేస్తాయని వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు