/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/srirangam-jpg.webp)
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో భక్తుల పై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఏపీకి చెందిన పలువురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ భక్తులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. భద్రతా సిబ్బంది దాడిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ భక్తులు క్యూలైన్ లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో స్వామి వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో.. భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#Repost @GemsOfKCR
— The Professor (@THE_PROFFESOR_) December 12, 2023
Devotees were beaten up by the police for chanting Govinda Govinda in Srirangam Ranganatha Swamy temple, Tamilnadu.!! 🤬
Udhaynidhi Stalin said, his govt would eradicate Sanatan Dharma, seems like DMK is standing by that.🤷
https://t.co/hBe0qsEcIK
Also read: ఏపీకి మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!