YCP: శ్యామల తోపా..?..ఆమె కంటే మాకేం తక్కువ

జగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఆ పార్టీ మహిళా నేతలు పలువురు సిద్ధమైనట్లు తెలుస్తోంది.బుల్లితెర యాంకర్ శ్యామలారెడ్డి ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైనప్పటి నుంచి కూడా చాలా మంది మహిళా నేతలు జగన్‌ మీద సీరియస్‌ గా ఉన్నట్లు సమాచారం.

New Update
jagan

YCP: వైసీపీకి ఆ పార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరు వరుష షాక్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఆ పార్టీ మహిళా నేతలు పలువురు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బుల్లితెర యాంకర్ శ్యామలారెడ్డి ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన సంగతి తెలిసిందే. 

Also Read: ఇజ్రాయెల్‌ ప్యాంట్‌ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!

అయితే ఆమె నియామకం జరిగినప్పటి నుంచి పార్టీలోని మహిళా నేతలు జగన్‌పై గుర్రుగా ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని.. శ్యామలకు పదవి కట్టబెట్టడంపై వైసీపీ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్యామల కంటే మాకు ఏం తక్కువనే ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ను నమ్ముకుని ఇక లాభం లేదని.. ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. 

Also Read:  జగన్‌ బెయిల్‌ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్!

త్వరలోనే పలువురు మహిళా నేతలు జగన్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే మాజీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. తమకంటే జూనియర్లకు పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బాటలోనే మరికొందరు మహిళా నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తనతో సమానమైన పదవి కట్టబెట్టినప్పటికీ.. తనకంటే ఎక్కువ శ్యామలకే ప్రాధాన్యమిస్తున్నారంటూ రోజా కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ఇరాన్‌ సైనిక బలగాలపై ఇజ్రాయెల్‌ దాడులు!

శ్యామలపై శ్రీరెడ్డి ఆగ్రహం..

యాంకర్ శ్యామలకు వైసీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించగా.. తాజాగా శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు దీనిపై శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పని చేయకపోయినా అందలం ఎక్కించారని ఫైరయ్యారు. తాను వైసీపీలో ఉంటే పార్టీకి చెడ్డ పేరని కొందరు వాగుతున్నారని.. ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్లంతా పత్తిత్తులా అంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ప్రైవేట్‌ స్కూళ్లో గ్యాస్‌ లీకేజీ...30 మంది విద్యార్థులు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు