YCP: వాళ్ళని వాడుకున్నది నిజం కదా? బాబు అంటూ వైసీపీ ట్వీట్

సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి వైసీపీ. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, అందులో రాజకీయంగా బావమరిది హరికృష్ణ సహా బంధువులను వాడుకున్న మాట నిజం కాదా? అని నిలదీసింది. హరికృష్ణకి మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నది నిజం కదా? అని ప్రశ్నించింది.

New Update
CBN YCP

YSRCP: సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైసీపీ సంచలన విమర్శలు చేసింది. కుటుంబాల్లో అనుబంధాలు గురించి, ప్రేమాభిమానాల గురించి చంద్రబాబు మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని సెటైర్లు వేసింది. తోబుట్టువులకు, సోదరులకు, బావమరుదులకు, చివరకు తల్లికి కూడా పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించింది. ఎఫెక్షన్‌, ఎమోషన్‌ లేని శాడిస్ట్‌ అని ఫైర్ అయింది. చంద్రబాబుకు అధికారమే అంతిమ లక్ష్యం అని పేర్కొంది. దీనికోసం ఎంత గడ్డైనా కరిచే మనిషి అని నిప్పులు చెరిగింది. 

ALSO READ:  సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!

చంద్రబాబుకు వైసీపీ ప్రశ్నలు...

1. చంద్రబాబు తన అఫిడవిట్ లో పేర్కొన్న స్వార్జిత ఆస్తుల్లో ఎన్ని తోబుట్టువులకు, సోదరులకు ఇచ్చాడు? 
2. చంద్రబాబు తన తల్లి పేరుమీద మదీనాగూడలో ఉన్న 5 ఎకరాలు. ఇప్పడు అది రూ.500 కోట్లు. ఇంత విలువైన భూమిని చంద్రబాబు తన తోబుట్టువులకు పంచారా? తన కొడుకు లోకేష్‌ పేరుమీద ఆ ఆస్తిని రాసివ్వలేదా? తోబుట్టువులకు ఒక్క గజం కూడా ఇవ్వాలని అనిపించలేదా?
3. తనతో కలిసి హెరిటేజ్‌ కంపెనీ పెట్టిన ఒక సినీనటుడ్ని గెంటేయలేదా? 
4. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి, అందులో రాజకీయంగా బావమరిది హరికృష్ణసహా బంధువులను వాడుకున్న మాట నిజం కాదా? హరికృష్ణ గారికి మంత్రిపదవి ఇచ్చి, ఆరునెలల్లో ఎమ్మెల్యే కావాలన్న నిబంధనల నేపథ్యంలో నియోజకవర్గం లేకుండా చేసిన చంద్రబాబు అనుబంధాల గురించి మాట్లాడ్డం విడ్డూరం కాదా?
 5.ఎన్టీఆర్‌ గారి రెండో భార్య లక్ష్మీపార్వతి గారు ఉంటున్న నివాసంపైకి చంద్రబాబునాయుడి పార్టీ దండెత్తిన దృశ్యాలను ప్రజలు మర్చిపోతారా? చట్టబద్ధంగా ఎన్టీఆర్‌ పెళ్లిచేసుకున్న లక్ష్మీపార్వతిగారికి ఇవ్వాల్సిన ఆస్తులపై చంద్రబాబుపార్టీ నడిపిన రాద్ధాంతం ప్రజలకు తెలియనిదా? ఈ ప్రశ్నలను సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

Also Read :  మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

Also Read :  పైనాపిల్ తింటే అంతే సంగతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు