ఆస్తి వివాదాలతో జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం!

ఈడీ 2016లో అటాచ్ చేసిన భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2019లో పంచుకున్నట్లు జగన్, షర్మిల చెబుతున్నారు. ఇలా చేయడంతో జగన్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.

New Update
JAGAN

భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2016లో ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల పంపకం 2019లో జరిగిందని జగన్, షర్మిల చెబుతున్నారు. ఇది బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment