World Economic Forum 2025: చంద్రబాబుతో రేవంత్ భేటీ!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సందర్భంగా ఈ ఇరువురు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో భేటీ అయ్యారు.

New Update
AP CM Chandrababu Revanth Reddy

AP CM Chandrababu Revanth Reddy

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లో ఏపీ సీఎం మంత్రుల బృందంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు