AP: బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్..!
ఏలూరు జిల్లా నూజివీడులో బాలిక అత్యాచార కేసును పోలీసులు చేధించారు. నిందితుడు మిరియాల జయరావును అరెస్టు చేశారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టామని ఎస్పీ శివకిషోర్ తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడులో బాలిక అత్యాచార కేసును పోలీసులు చేధించారు. నిందితుడు మిరియాల జయరావును అరెస్టు చేశారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టామని ఎస్పీ శివకిషోర్ తెలిపారు.
ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన మందులు, పరికరాలు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు.
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది.సుమారు 300 సినిమాల్లోని సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్లు బాపు,విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఈ చెట్టుకింద తీర్చిదిద్దారు.
పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాపులు అంటే అల్లరి మూక అని ముద్ర పడిందని అలా కాకుండా రంగా ఆశయ సాధన కోసం బలహీన వర్గాలకు తోడుగా, అండగా నిలవాలని జిల్లాలోని కాపు ముఖ్య నాయకులు అన్నారు.
ఏలూరు జిల్లాలో పోలవరం రైతులను మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మోసపోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రూ. 3.5 కోట్లు చెల్లించకుండా మోసం చేశారన్నారు.
ఏపీలోని మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటివైపు దూసుకెళ్లింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే చోట స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి.
ఏపీలోని అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లాడిన భార్య దేవిని ఆవేశంలో తలపై కొట్టి చంపేశాడు. కుంటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్దారించారు. పరారిలో ఉన్న నిందితుడిని పట్టుకుని రిమాండ్ కు తరలించారు.
ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో తన పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను రక్షించాలని వేడుకుంది.