Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు

New Update
cyclone

Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుపాను తీరాన్ని చేరినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఫెంగల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు సమయం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఫెంగల్ తుపాను మహాబలిపురానికి 50 కి.మీ, పుదుచ్చేరికి 80 కి.మీ, చెన్నైకి 90 కి.మీ దూరంలో ఉంది. అనంతరం నెమ్మదిగా కదులుతూ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుపాను తీవ్ర వాయుగుండం బలహీనపడినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Also Read: TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్

మరోవైపు తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయని   ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తుపాను తీరం దాటనున్న సమయంలో.. తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read:  పవన్ 'OG' లో పాన్ ఇండియా హీరో..సినిమాటిక్ యూనివర్స్ ప్లానింగ్ లోసుజిత్

మరోవైపు ఫెంగల్ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్ఛేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయగా.. పలు విమానాలను కూడా నిలిపేశారు. అటు తుపాను ప్రభావంతో తిరుపతిలోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాలను కూడా అధికారులు నిలిపేశారు. తిరుమలలోనూ వర్షం కురుస్తోంది. ఓ వైపు వర్షం.. మరోవైపు వణికిస్తున్న చలితో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి పెరుగుతూ ఉండటంతో భక్తులకు టీటీడీ వేడి పాలు అందజేస్తుంది. శ్రీవారి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

Also Read: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!

పలు విమానాలు రద్దు..!

ఈ ఫెంగల్‌ తుఫాను ఎఫెక్ట్‌తో.. ప్రభావితం ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై ఉండగా.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే.. తమిళనాడులోని చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు కొన్ని గంటల పాటు మూసి వేశారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కూడా విమానాల రాకపోకలపై ప్రభావం చూపించింది.

Also Read: Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్

దీంతో హైదరాబాద్‌ నుంచి నడవాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు రావాల్సిన విమానాలను అధికారులు క్యాన్సిల్‌ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయం పూర్తిగా మూసేయటంతో.. హైదరాబాద్‌ రావాల్సిన 3 విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక.. ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరాల్సిన విమానాలను కూడా దారి మళ్లించారు. 

ఫెంగల్‌ తుపాను ఎఫెక్టుతో తమిళనాడు రాజధాని చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 దీంతో.. సాయంత్రం 7 గంటల వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. సర్వీసుల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు