విశాఖ పోర్టుకు క్రూయిజ్ నౌక!
Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది.
Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది.
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.
గత మేనిఫెస్టోను అమలు చేయకుండా వైసీపీ నేడు విడుదల చేసిన కొత్త మేనిఫెస్టోకు విలువ ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందన్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని కామెంట్స్ చేశారు.
AP: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించే విశాఖలో కుట్ర జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తనకు విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు.
AP: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఆయనపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిందితుడు దస్తగిరి వివేకాను దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు.