Cyclone : మరో తుఫాన్ ముప్పు!
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
అల్లూరి జిల్లా కొర్రాయి పంచాయతీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు.
వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పా.. ఎవరూ మిగలరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. ఆ పార్టీ మునిగిపోయిన నావ అని అన్నారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.