Vande Bharat: వందే భారత్ ఈ స్టాప్ లో కూడా! దుర్గ్ - విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేడు ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. By Bhavana 16 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vande Bharat: విశాఖ కు నేడు మరో కొత్త వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ – విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. మొదటి రోజైనా నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది.. ప్రతి ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో.. 16 బోగీలు, అందులో 14 చైర్ కార్, రెండు ఎగ్జికూటివ్ బోగీలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంలో మాత్రమే... ఈ రైలు ఆరు రోజుల పాటూ ఉదయం 5.45 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి ఈ రైలు విశాఖలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుతుంది. 16 కోచ్‌లతో నడిచే ఈ రైలు రాయపూర్, మహా సముంద్, ఖరియార్ రోడ్డు, కంటాబంజి, టిట్లాఘర్, కెసింగ, రాయగడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో స్టాప్‌లు ఇచ్చారు. వాస్తవానికి ఈ రైలు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నంలో మాత్రమే ఆగుతుందని మొదట షెడ్యూల్ ప్రకటించారు. పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో కూడా... అయితే ఆ తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో కూడా స్టాప్ ఇచ్చారు.ఈ వందేభారత్‌కు పార్వతీ పురంలో హాల్ట్ ఇవ్వడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు దుర్గ్‌లో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. రాయ్‌పూర్, కరియార్ రోడ్డు, కంటాబంజి, టిట్లాగఢ్ ,కేసింగ, రాయగడ స్టేషన్‌లతో పాటు పార్వతీపురం, విజయనగరంలో ఆగి విశాఖపట్టణం చేరుకుంటుంది. అంటే కొత్తగా పార్వతీపురం స్టేషన్‌కు హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు దుర్గ్‌లో బయల్దేరి.. పార్వతీ పురానికి ఉదయం 11.30 నిమిషాలకు వచ్చి 11.32 నిమిషాలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి పార్వతీపురంలో సాయంత్రం 4.36 గంటలకు వచ్చి 4.38 నిమిషాలకు తిరిగి దుర్గ్ కు బయల్దేరుతుంది. Also Read: Donald Trump: అమెరికాలో కాల్పులు..ట్రంప్ నకు సమీపంలోనే ఘటన! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి