/rtv/media/media_files/2025/02/13/F9zoV9zECBXzVIQhMkgB.jpg)
vamshi
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు. దీంతో మార్చి 25వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ఈ రోజు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి 2025 మార్చి 25 వరకు వంశీ రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే.
Also read : గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు... హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!
Also read : చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్
వంశీపై ఆరు కేసులు నమోదు
ఇదేకాకుండా భూమిని కబ్జా చేశారంటూ వల్లభనేని వంశీపై మరో కేసు కూడా నమోదు అయింది. మల్లపల్లి పారిశ్రామికవాడలో 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారని కేసు నమోదైంది. మొత్తం ఇప్పటి వరకు వంశీపై ఆరు కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
Also read : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను స్క్రూడ్రైవర్ తో పొడిచి.. ఆపై కత్తితో ఘోరం..
Also Read : అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి